ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని తీర్చే దిశగా వారాహి యాత్ర దూసుకెళ్తోందని గుంటూరు జిల్లా, జనసేన నాయకులూ గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ఏలూరు సభలో రాష్టంలో జరుగుతున్న పరిణామాలు గురించి ప్రజలకు వివరించామన్నారు. ఒక్క సీటు లేని జనసేనకు 151 సీట్లు ఉన్న వైసీకీ తేడా ఏంటి అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు దిజగజారిపోయి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ఇంట్లో కూర్చొని ముఖ్యమంత్రి పబ్ జీ గేమ్ ఆడుకుంటున్నారని గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు.