ప్రకాశం జిల్లాలోని దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లిబస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన చెందారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని... మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు.