బిల్డ్ అమ రావతి సేవ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలు సోమవారం నాటికి 1301వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, తట్ట మట్టివేయకుండా అమరావతి అభివృద్ధి చేయనివారికి మూడు రాజధానులనే అర్హత లేదన్నారు. ఆర్-5 జోన్‌ను క్రియేట్ చేసి సెంటు స్థలాలు పం పిణీ చేస్తున్నది పేదల మీద ప్రేతో కాదని, అమరావతి మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేయడం కోసమన్నారు. ఇలా చేయటం వలన రాజధాని అమరావతికి విలువ లేకుండా చేయాలనే కుట్ర చేశారన్నారు. పాలకులు ఎవరైనా సరే రాజధానిని నాశ నం చేయాలనుకోవటం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ముక్కల ఆటను శాశ్వతంగా పక్కన పడేసి అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించి అభివృద్ధిని కొసాగించాలన్నారు.