విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో మంగళవారం ఎంవిపి పోలీస్ స్టేషన్లో 15, 16, 17, 18, 23వార్డుల కార్పొరేటర్లు, ఇన్చార్జులు సమక్షంలో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ తక్షణం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటివ్యాఖ్యలు చేయకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించానలి అక్కరమాని విజయనిర్మల డిమాండ్ చేశారు.