మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు కారణంగా రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కాంగ్రెస్ నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మౌన సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద ఆ పార్టీ నేతలు మౌన సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. నేడు ఉ. 10 గంటల నుండి సా. 5 గంటల వరకు పార్టీ నాయకులు దీక్షలో కూర్చుంటారు.