ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలకు అర్హులైనా, రానివారికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగనన్న సురక్ష" లో భాగంగా బుధవారం ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు సచివాలయ ఆవరణలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ పాల్గొన్నారు.