వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు జనసేనానిపై విజయవాడ కృష్టలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పవన్ కళ్యాణ్ మీద 153, 153ఎ, 502(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.