ఇండియన్ ముజాహిద్దిన్ ఉగ్రవాదులకు శిక్ష ఖరారైంది. నలుగురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఒబేదుర్ రెహ్మాన్ కూడా నిందితుల్లో ఉన్నాడు. రెహ్మాన్, ధనిష్ అన్సారి, ఆఫ్తాబ్, ఇమ్రాన్ ఖాన్ లకు శిక్ష పడింది. నిందితులు లుంబిని పార్క్, గోకుల్ చాట్, వారణాసి, ముంబై, ఫైజాబాద్, లక్నో, హైదరాబాద్ జంట పేలుళ్లు, జైపూర్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై సీరియల్ బ్లాస్ట్ దాడుల్లో కీలక వ్యక్తులు.