మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు పెట్టి వాహనాలు సీజ్ చేస్తామని పలమనేరు సిఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలో డి. ఎస్. పి సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సీఐ లైసెన్స్ లేకుండా మైనర్లకు చెందిన 20 వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ తోపాటు ఎస్సై సుబ్బారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.