కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని ఐదవ వార్డు బెజవాడ గోపాలకృష్ణారెడ్డి నగర్ నందు నుడా నిధులు 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డు, సైడ్ కాలువలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ సుప్రజా మురళి, అధికారులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.