విశాఖ జిల్లా రవాణా అధి కారిగా (నాన్ ట్రాన్స్పోర్ట్) గొర్లె మనీషా గురువారం నియమితులయ్యారు. రవాణా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2022 గ్రూప్-1 బ్యాచ్లో ఎంపికైన ఆమెకు 9 నెలల శిక్షణ అనంతరం మొదటి పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. రవాణా శాఖకు సంబంధించిన సేవలపై ప్రజలకు విస్తృత అవగా హన కల్పిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.