సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసిన ఎనిమిది నెలల తర్వాత ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జస్టిస్ డి రమేష్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు, జస్టిస్ లలిత కన్నెగంటిని తెలంగాణ హైకోర్టు నుండి కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ విపుల్ ఎం పంచోలీని రాష్ట్రపతి బదిలీ చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. జస్టిస్ రమేశ్, కన్నెగంటిలను నవంబర్ 24, 2022న, జస్టిస్ పంచోలిని సెప్టెంబర్ 29, 2022న బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సులు చేసింది.