యమునా నది పొంగిపొర్లడంతో ఢిల్లీని వరద నీరు ముంచెత్తింది. ఎర్రకోట సహా ముఖ్యమైన ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఫలితంగా గురువారం ఢిల్లీలో వరద సహాయక చర్యల్లో మొత్తం 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. శుక్రవారం ఉదయం నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని ఎన్డిఆర్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మొహసేన్ షాహెదీ తెలిపారు. ఢిల్లీలోని మొత్తం ఆరు జిల్లాలు వరదల బారిన పడ్డాయని వెల్లడించారు.