ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో శుక్రవారం రాజుపాలెం సర్పంచ్ హటేల్ పీరా ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జడ్పిటిసి సారే వెంకట నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ధృవీకరణ పత్రాలు ఉచితంగా జడ్పిటిసి అందజేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ఉద్దేశంతో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జడ్పిటిసి అన్నారు.