ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించింది. ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిషేధించాలని గత నెల మార్చి 23న ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.