వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తండ్రి మజ్జి నరసింహారావు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. అతని పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ప్రదీప్ నగర్ చిన్న శ్రీను స్వగృహం వద్ద ఉంచారు. వారి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి, చిన్న శ్రీనును పరామర్శించారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు తోటపాలెం రోటరీ స్వర్గధామంలో అంతిక్రియలు నిర్వహించారు.