మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అతడిని అరెస్టు చేసి,కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించడం చట్టబద్ధమైనదని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి అరెస్టు, కస్టడీపై సెంథిల్ భార్య మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సీవీ కార్తికేయన్ ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది.