జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) తండ్రి అయిన మజ్జి నర్సింగరావు కు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపి బొత్స ఝాన్సీ లక్ష్మి చిన్న శ్రీను ఇంటికి వెళ్ళి, నర్సింగరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నర్సింగరావు మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.