ఏలూరులోని పెదపాడు మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మరణం తర్వాత ఓ మహిళ తన మేనత్త కొడుకుతో రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత పిల్లలు పుట్టడం లేదని, వేరే పెళ్లి చేసుకుంటానని రెండో భర్త బెదిరించేవాడు. దాంతో ఆ తల్లి 17 ఏళ్ల పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని భర్తను ఒప్పించింది. ఆ తర్వాత మగ పిల్లాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడిలో జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.