ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకునేందుకు కట్నం డిమాండ్ చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ముదినేపల్లి మండలం చేవూరుపాలెంకు చెందిన శొంఠి నాగదుర్గ(19)కు ఇన్స్టాగ్రామ్లో కృష్ణాజిల్లా గాయంపాడుకు చెందిన వాలంటీరు శివనాగరాజుతో పరిచయమై, ప్రేమగా మారింది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లిచేసుకోమని అడగగా రూ.2 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.