కశ్మీర్లో ఓ మహిళ ఏకంగా 32 పెళ్లిళ్లు చేసుకుంది. బుద్గామ్లోని ఖాన్సాహిబ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అల్తాఫ్ మీర్ (48) అనే వ్యక్తి తన భార్య జహీన్ అక్తర్ కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా దాదాపు డజన్ మందికిపైగా పురుషులు పోలీసులను ఆశ్రయించారు. అన్ని కేసుల్లోనూ ఆ ఒక్క మహిళ తప్పిపోయిందని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. 32 మందిని మోసం చేసి డబ్బులు, నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.