విజయవాడలో ఈనెల 28 నుండి 3 రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఫెస్టివల్ లో రోజూ రూ. 699కే అన్ లిమిటెడ్ సీ ఫుడ్ బఫే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మత్స్య సంపదలో ఏపీ దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నప్పటికీ స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదని, దీంతో డొమెస్టిక్ మార్కెట్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.