ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ విద్యుత్తు ఉద్యోగులు తమకు న్యాయంగా దక్కాల్సిన పింఛను అందడం లేదని విజ్ఞప్తి చెయ్యడంతో ... ‘నేను అధికారంలోనికి వచ్చిన వెంటనే 653, 654 ఉత్తర్వులను అమలు చేస్తా’ అని హామీ ఇచ్చారు అని కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదు అని విద్యుత్తు సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. వైఎ్‌సఆర్ హయాంలో జారీ అయిన ఉత్తర్వుల గురించి ఇంధన శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.