ఇప్పటికే టమాటా ధరలు కొండెక్కడంతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు ఉల్లి ధర కూడా షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఎర్ర ఉల్లి ధర రూ.30-35 ఉండగా.. తెల్ల ఉల్లి రూ.40-60 పలుకుతోంది. మరో నెల, రెండు నెలల్లో ఈ ధర రూ.100కు పైగా చేరుకోవచ్చని ఎన్సీఎమ్ఎల్ సీఈవో సంజయ్ గుప్తా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి నిల్వలు తగ్గడం.. ఈసారి దిగుబడి పడిపోవడమే దీనికి కారణమని తెలిపారు.