రాష్ట్రంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారా? అని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ గావు కేకలు పెడుతున్నారు. ఈ పిచ్చి రాతలు, కూతలు, అభూత కల్పనలకు ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...... పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం సీఎం శ్రీ వైయస్ జగన్ అని ఆరోపిస్తున్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కూడా మేమే కారణం అని నిందిస్తున్నారు. మా బాబు వస్తేనే పోలవరం పూర్తవుతుందని అంటున్నారు. మీ బాబు వల్లే కదా పోలవరానికి ఈ దుస్థితి పట్టిందన్నది టీడీపీ నేతలు మొదట తెలుసుకోవాలి. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది మీ బాబే కదా.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం మీ బాబే కదా.. దాని వల్లే కదా ప్రాజెక్టు ఆలస్యమవుతుంది. ఈ సత్యాలను మీరు దాచేసి, పెద్దగా కేకలు వేసినంత మాత్రాన దాగవు. ప్రజలకు వాస్తవాలు తెలుసు అని తెలియజేసారు.