గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల వద్ద ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని, పోలీసుల నిఘా ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి. రమేష్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జ్యోతి శనివారం డిఎస్పీ నరసింగప్పకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థినిలు ఇళ్లకు వెళ్ళేటపుడు కొందరు ఆకతాయిలు వెంటపడి వేధిస్తున్నారని డిఎస్పీకి తెలిపారు. కావున తమ సిబ్బందిని నిఘా ఉంచి వారిని కట్టడి చేయాలని కోరారు.