ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సుల భర్తీకి శనివారం గుంటూరు ఆర్డీలో కౌన్సెలింగ్ జరిగింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో 76 మందికి నూతనంగా స్టాఫ్ నర్సులుగా ఉద్యోగ నియామక పత్రాలను గుంటూరు ఆర్డీ యాస్మిన్ అందజేశారు. ఉద్యోగాలు పొందిన నర్సింగ్ సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.