రైతుబజార్లలో బీపీటీ బియ్యం కేజీ రూ. 48లకు, స్టీమ్ బియ్యం కేజీ రూ. 4కి అందజేస్తున్నట్లు జేసీ రాజకుమారి తెలిపారు. శనివారం చుట్టుగుంట రైతుబజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, తెనాలి నాజర్పేట, పొన్నూరు రైల్వేస్టేషన్ రోడ్డు, మంగళగిరి మార్కెట్ యార్డు కాంప్లెక్స్, తెనాలి గంగానమ్మపేట రైతుబజార్లలోనూ వీటిని అందుబాటులో ఉంచుతోన్నామన్నారు. అలానే మినపగుళ్లు కేజీ రూ. 101, కందిపప్పు రూ. 135కి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.