ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని దిండుక్కల్కి చెందిన మణికంఠన్ (21) ట్రాన్స్ ఉమెన్‌గా మారి మాయగా పేరు మార్చుకున్నాడు. అదే విధంగా మదురైకు చెందిన ఉమామహేశ్వరి (24) లింగ మార్పిడితో పురుషుడిగా మారి గణేష్‌గా పేరు మార్చుకుంది. వీరిద్దరూ దిండుక్కల్ అభిరామి అమ్మన్ ఆలయానికి వచ్చి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు హాజరయ్యారు.