భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.అయితే ఈరోజు అంబటి రాయుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను సమాజాన్ని అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. రాజకీయ పార్టీల వైపు అడుగులు వేయడంలేదని స్పష్టం చేశారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక విదేశాల్లో లీగ్‌లు ఆడేందుకు ఆహ్వానాలు అందాయి. కానీ సొంత రాష్ట్రానికి కొంత సేవ చేయాలనేదే నా ఉద్దేశం' అని అన్నారు.