ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను భర్తీ చేయనుంది. జులై 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. నాలుగు విడదలుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సోమవారం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని కాళోజీ విశ్వవిద్యాలయం అధికార వర్గాలు తెలిపాయి.