ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు సంపూర్న మద్దతు తెలియజేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటం సచివాలయం లో మంగళవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో ను 99శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డు, వివిధ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.