రాజస్థాన్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అనంతరం మృతదేహాలను దహనం చేశారు. మృతి చెందిన వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. పోలీసులు, జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్త ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిని ప్రతీకార చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జోద్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.