విశాఖ నగరంలోని కొమ్మాదిలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శివశక్తికాలనీలో ఎంవీకే ప్రసాద్ (54), రాజరాజేశ్వరి (50) అనే దంపతులు స్మార్ట్ విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కవిటి కేంద్రంగా ఉన్న సంస్థలో ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనడంతో నిరుద్యోగులు రూ.20- 25వేల వరకు సంస్థకు చెల్లించారు. చివరకు నిరుద్యోగుల ఒత్తిడితో వారు ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.