పెదకూరపాడు మండలంలోని తమ్మవరం గ్రామంలో 10 లక్షల జీజీఎంపీ నిధులతో రెండు సీసీ రోడ్లు, డ్రెయిన్లు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం పూర్తైన గ్రామాలకు 20 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వ అందిస్తుంది అన్నారు. క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ సాంబిరెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ వీరయ్య, తమ్మవరం నాయకులు పాల్గొన్నారు.