ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పురంధేశ్వరికి అవగాహన లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎంత అవసరమో అంతే నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి రూపాయికీ లెక్క ఉంటుందని చెప్పారు. పురంధేశ్వరి మరిది చంద్రబాబు హయాంలోనూ అప్పలు చేశారని, మరి ప్రశ్నించలేదని మండిపడ్డారు.