ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని కంచన్‌పూర్ గ్రామ సమీపంలో బుధవారం 30 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు పిల్లలు గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో బస్సు, ట్రక్కు డ్రైవర్లు కూడా గాయపడ్డారు. ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ట్రక్కు డ్రైవర్, సహాయకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.