ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో పెళ్లిచేసుకునే వారికి కొత్త నిబంధన తెచ్చారు. వయసు ధృవీకరణ కోసం ఆధార్ ప్రామాణికం కాకుండా టెన్త్ మార్క్ లిస్ట్ లేదా టీసీ, చదువుకోని వారైతే డాక్టర్ నుండి వయసు ధృవీకరణ పత్రం తీసుకోవాలని దేవాలయ అధికారులు ఐసీడీఎస్ అధికారులు సూచించారు. అబ్బాయి వయసు 21, అమ్మాయి వయసు 18 ఉంటేనే ఆధార్ కార్డుతో పాటు ధృవీకరణ పత్రం చూపించాలని తెలిపారు.