నేటి నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు సాగనున్న ఈ సమావేశాల్లో 32 అంశాలు, 21 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మణిపూర్ అల్లర్లు, యూనిఫామ్ సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్సు, రాహుల్ గాంధీపై వేటు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీంతో పార్లమెంటు సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.