ఏపీలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ నేతన్న నేస్తం' నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ శుక్రవారం రోజు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున జమచేస్తారు. అర్హుల జాబితాను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం గత నాలగేళ్లలో నేతన్నలకు ఈ పథకం ద్వారా రూ. 776 కోట్లు సాయం అందించింది.