వర్షాకాలంలో మాత్రమే దొరికే పులస చేపలకు ఆంధ్రలో భారీగా డిమాండ్ ఉంది. జులై నుంచి సెప్టెంబర్లో గోదావరి ప్రాంతంలో మాత్రమే పులసలు కనిపిస్తాయి. గోదావరి ప్రాంతంలోని స్థానిక మార్కెట్లో కిలో చేప రూ.4 వేలకు అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు పులస ధరలు షాకిస్తున్నాయి. ప్రస్తుతం పులస కిలో ధర రూ. 20వేల కంటే ఎక్కువగా పలుకుతోంది. జనాలు ఎగబడి పులసలను కొనుగోలు చేస్తున్నారు.