ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ముంబైలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు ముంబై, దాని శివారు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa