వైసిపి ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. గురువారం ఆయన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.