మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హతకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. సూరత్ కోర్టు తీర్పును నిలిపివేయడానికి గుజరాత్ హైకోర్టు తిరస్కరించడాన్ని రాహుల్ సుప్రీంలో సవాల్ చేశారు. రాహుల్ గాంధీ తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.