విశాఖస్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో జూన్ నెలలో కోత పడింది. నెలకు సంబంధించిన జీతాలు ఈ నెల ఏడో తేదీ నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే తమ జీతాల్లో రూ. 2, 400 తగ్గడంతో అంతా గగ్గోలు పెడుతున్నారు. అసలే అంతంతమాత్రం జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తరుణంలో ఇంత మొత్తం కోత విధిస్తే తామెలా జీవనం సాగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.