తాము సరఫరా చేసిన క్లస్టర్ ఆయుధాలను ఉక్రెయిన్ సేనలు.. రష్యా దళాలపై వాడుతున్నాయని అమెరికాలోని శ్వేతసౌధం ధ్రువీకరించింది. నేషనల్ సెక్యూరిటీ ప్రతినిధి జాన్ కిర్బి మాట్లాడుతూ.. రష్యా సైన్యం స్థావరాలు, ఆపరేషన్లపై ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. మరోవైపు రష్యా 4 రోజుల్లో 70 క్షిపణులు, 90 షహీద్ డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్ ఓడరేవు నగరమైన ఒడెస్సాలో విధ్వంసం సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa