ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు పక్కనున్న కాలంలోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ఆర్టీసీ బస్సు మడకగిరి డిపోకు చెందింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa