ఎర్రగుంట్ల మండలంలోని నిడిజివ్వి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి శనివారం ప్రజా దర్బార్లో నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పరిశుద్ధ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందని చెప్పారు.