దేశ సరిహద్దుల్లో పహారా కాసే సైనికులుగా మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా బీఎస్ఎఫ్ జవాన్ విధులకు వెళ్తూ కన్నీటి పర్యంతం అయింది. తన 9 నెలల పాపను వదిలి వెళ్తూ భావోద్వేగానికి గురైంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. రైల్వే స్టేషన్లో బిడ్డను వదిలి వెళ్లలేక ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైనికుల త్యాగాలను కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.