వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు షర్మిలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిల నుండి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో షర్మిల దర్యాఫ్తు సంస్థల ముందు చెప్పినవన్నీ వాస్తవాలే అన్నారు. వైఎస్ వివేకా హత్య వల్ల ఆ కుటుంబం ఎంతగా నష్టపోయిందో, జగన్ కారణంగా రాష్ట్రం కూడా అంతే నష్టపోయిందన్నారు.